స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే

|

Aug 05, 2024 | 9:30 PM

శుక్రవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల సహా మొత్తం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దాంతో స్కూల్‌ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటిదేమీ లేదని తేల్చారు. కాగా ఈ బాంబ్‌ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని అనుమానితుడిగా గుర్తించామని చెప్పారు.

శుక్రవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల సహా మొత్తం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దాంతో స్కూల్‌ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటిదేమీ లేదని తేల్చారు. కాగా ఈ బాంబ్‌ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని అనుమానితుడిగా గుర్తించామని చెప్పారు. స్కూల్‌కు వెళ్లే మూడ్ లేక బాలుడు ఈ పని చేశాడని వివరించారు. దర్యాప్తులో బాలుడు ఈ విషయాలను ఒప్పుకున్నాడని తెలిపారు. తాను పంపిన ఈ-మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు మరో రెండు స్కూళ్లకు కూడా మెయిల్స్ పంపించినట్టు ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో స్కూల్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రమాదం లేదని తేల్చారు. అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు మెయిల్ వచ్చిందని, పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారని అధికారులు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమీ లేదని తేల్చిందని వివరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..

ఈసారి ఖైరతాబాద్‌ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??

అండర్‌ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Nayanthara: వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల విరాళం

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?? ఇలా చేసి చూడండి !!

Follow us on