Kashmir: క్రికెట్​ బాల్​‌‌తో చిరుత బారి నుంచి తన తమ్ముణ్ణి కాపాడిన 9 ఏళ్ల అన్న.

|

Mar 22, 2024 | 12:45 PM

జమ్ముకశ్మీర్​లోని బుద్గామ్​లో ఓ 12 ఏళ్ల బాలుడు తన ధైర్యసాహసాలతో తన తమ్ముడిని చిరుతపులి బారి నుంచి ప్రాణాలతో కాపాడాడు. క్రికెట్ ఆడుతుండగా దూసుకొచ్చిన చిరుతను తన దగ్గర ఉన్న బాల్​తో పారిపోయేలా చేశాడు. చిరుత కంటిపై గురిచూసి కొట్టి తన తమ్ముడిని కాపాడాడు. అసలేం జరిగిందంటే? నాలుగో తరగతి చదువుతున్న అకిబ్ జావేద్ తాజాగా తన ఇంటి సమీపంలో తన తమ్ముడితోపాటు మరికొందరు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు.

జమ్ముకశ్మీర్​లోని బుద్గామ్​లో ఓ 12 ఏళ్ల బాలుడు తన ధైర్యసాహసాలతో తన తమ్ముడిని చిరుతపులి బారి నుంచి ప్రాణాలతో కాపాడాడు. క్రికెట్ ఆడుతుండగా దూసుకొచ్చిన చిరుతను తన దగ్గర ఉన్న బాల్​తో పారిపోయేలా చేశాడు. చిరుత కంటిపై గురిచూసి కొట్టి తన తమ్ముడిని కాపాడాడు. అసలేం జరిగిందంటే? నాలుగో తరగతి చదువుతున్న అకిబ్ జావేద్ తాజాగా తన ఇంటి సమీపంలో తన తమ్ముడితోపాటు మరికొందరు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అకిబ్ తమ్ముడిపై చిరుతపులి దూసుకొచ్చింది. అది చూసిన అకిబ్ తన జేబులో ఉన్న క్రికెట్ బాల్​ను చిరుతపులి కంటిపై విసిరాడు. తన తమ్ముడిపై ఉన్న చిరుత దృష్టిని మళ్లించాడు. ఆ తర్వాత అకిబ్​ స్నేహితుడు ఇటుకను తీసుకొచ్చి చిరుతపైకి విసిరాడు. గట్టిగా చిరుత చిరుత అంటూ అరిచాడు. వెంటనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిపి చిరుతను చెదరగొట్టారు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కొన్ని గంటల తర్వాత తీసుకెళ్లారు.

తాము ఆడుకుంటూ ఉండగా తమ ఇంటి సమీపంలో ఏదో జంతువు వస్తున్నట్లు అనిపించిందనీ వెంటనే చూడగా చిరుత తన తమ్ముడిపైకి దూసుకొచ్చిందని అకీబ్‌ తెలిపాడు. తన దగ్గర ఉన్న బాల్​ను విసిరాననీ ఫ్రెండ్స్ కూడా సహాయం చేశారని చెప్పాడు. ఇటీవల తమ ఊర్లో ఓ బాలిక చిరుతపులి దాడిలో చనిపోయిన విషయం గుర్తొచ్చి భయమేసిందనీ అకిబ్ తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..