Karnataka: ఆయిల్‌ ట్యాంకర్‌ రూపంలో పొంచి ఉన్న మృత్యువు..! 12 మంది మృతి.

|

Oct 27, 2023 | 8:50 PM

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా .. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.దసరా పండగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా .. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దసరా పండగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు ఉండటంతో డ్రైవర్‌ నరసింహులు.. ఆగి ఉన్న ట్యాంకర్‌ గమనించకుండా ఢీ కొట్టాడు. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. ఏడుగురు చిక్‌బళ్లాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..