Indians in Nepal: నేపాల్‌లో బందీలుగా 11 మంది భారతీయులు.. రక్షించిన నేపాల్ పోలీసులు.

|

Feb 17, 2024 | 7:35 PM

నేపాల్‌లో బందీలుగా ఉన్న 11 మంది భారతీయులను పోలీసులు రక్షించారు. అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా.. 11 మంది భారతీయులను బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్‌ చేశారు. ఆ ముఠా చెరలో ఉన్న భారతీయులను రక్షించారు. ఢిల్లీ, హర్యానాకు చెందిన సుమారు 11 మంది అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఒక ముఠాకు ఒక్కొక్కరు రూ.45 లక్షల చొప్పున చెల్లించారు.

నేపాల్‌లో బందీలుగా ఉన్న 11 మంది భారతీయులను పోలీసులు రక్షించారు. అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా.. 11 మంది భారతీయులను బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్‌ చేశారు. ఆ ముఠా చెరలో ఉన్న భారతీయులను రక్షించారు. ఢిల్లీ, హర్యానాకు చెందిన సుమారు 11 మంది అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఒక ముఠాకు ఒక్కొక్కరు రూ.45 లక్షల చొప్పున చెల్లించారు. ఆ ముఠా సభ్యులు 11 మంది భారతీయులను నేపాల్‌కు తరలించారు. అక్కడి నుంచి అమెరికాకు పంపుతామని నమ్మించారు. గత నెల రోజులుగా ఒక ఇంట్లో వారిని బంధించారు. నేపాల్‌ పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో రాజధాని ఖాఠ్మండులోని రాటోపుల్ ప్రాంతంలో ఓ ఇంటిపై రైడ్‌ చేశారు. బందీలుగా ఉన్న 11 మంది భారతీయులను రక్షించారు. ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ముఠా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతోందని నేపాల్‌ పోలీస్‌ అధికారి ఆరోపించారు. నేపాల్‌ మీదుగా అమెరికా తరలించేందుకు ఒక్కొక్కరి నుంచి సుమారు 45 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తమకు తెలిసిందని అన్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..