History: వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

|

Dec 21, 2024 | 6:06 PM

చరిత్ర కట్టడాలకు పురాతన నిర్మాణాలకు తెలంగాణ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇది అందరికి తెలిసిందే. నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి కొన్నికట్టడాలు. ఈకోవకు చెందిందే వందల ఏళ్ల నాటి నాగన్న మెట్ల బావి. కరీంనగర్ జిల్లా, ఎలగందుల గ్రామంలో ఈ నాగన్న అనే మెట్ల బావి ఉంది. దీనిని నాగన్న అనే స్థానికుడు మెట్ల బావి నిర్మాణం బాధ్యతలు చూసుకోగా దీనిని నాగన్న బావి అని పిలుస్తారు.

కాకతీయుల కాలంలో ఈ బావిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉద్దేశంతో ఈ మెట్ల బావి నిర్మించినట్లు తెలుస్తోంది. స్తంభాలపై చెక్కిన దేవత మూర్తుల విగ్రహాలు కూడా అప్పటి రాజులు ఏలిన పరిపాలనను చూపిస్తున్నాయి. బావి కింద పెద్ద సొరంగ మార్గం ఉన్నట్లు తెలుస్తుంది.. మమెట్లతో కూడిన ఈ అద్భుతమైన నిర్మాణం రెండు అంచెలుగా రూపొందించబడింది. ఒక్కో లెవెల్ 20 అడుగుల ఎత్తు ఉండగా బావి చుట్టూ మెట్లు నిర్మాణం చేపట్టారు..గుర్రాలు, ఏనుగులు, సులభంగా నీరు తాగేందుకు వీలుగా భావిని పడమటి వైపు వెడల్పుగా నిర్మించారు. ఇప్పటికి కూడా ఈ మెట్ల బావీ చెక్కుచెదరకుండా ఉంది. రాజులు ఈ బావిలో స్నానం చేసి పక్కనే ఉన్న గుడిలోకి వెళ్లి పూజలు చేసేవారు. ఈ బావని పట్టించుకునే వారు లేక ఈ బావి నిరుపయోగంగా మారింది.

ఈ బావిలో నీరు చెత్తాచెదారంతో నిండుకుందని స్థానికులు తెలుపుతున్నారు.. అయితే ఈ బావిని పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతుండగా ఇప్పటికే ఈ పురాతన కట్టడాన్ని చూసేందుకు సూదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుందడం విశేషం. గతంలో ఇక్కడ భారీ సంపద దాచారని ప్రచారం జరిగింది. దాంతో గుప్తనిధుల ముఠా ఈ ప్రాంతంలో తరచూ అక్రమ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. దాంతో ఈ మెట్ల బావి చుట్టూ ఎటు చూసినా తవ్వకాలే కనిపిస్తాయి. ఈ బావి దాదాపు 60 అడుగుల లోతు ఉంటుందనీ అంచనా. నాగన్న మెట్ల బావిలో వేసవి కాలంలో కూడా నీరు ఉండటం చూస్తాం. అయితే నీరు తగ్గిన సమయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. బావి పక్కన గదుల్లో బంగారం దొరికిందనే ప్రచారం జరిగింది. ఈ ప్రాంతంలో సంచరించే ఓ ముఠా గుప్త నిధుల వేటలో నాగన్న బావి పరిసర ప్రాంతాన్ని అపవిత్రం చేశారు. ఇటీవల మేకతో పాటు, ఇతర జంతువులను బలి ఇచ్చారు. పసుపు, కుంకుమ పూజా సామగ్రి బావి పక్కన ఉండటం చూసి స్థానికులు భయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.