ఇంట్లో ఉంటే మంచిదంటూ.. అరుదైన సముద్ర ప్రాణుల అమ్మకం

|

Jun 27, 2024 | 3:36 PM

సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో నెలరోజులు కాపు కాసి శ్రీనివాస్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు విజయవాడలో పట్టుకున్నారు. ఈ స్థాయిలో అమ్మకాలు జరుపుతూ పట్టుబడటం దేశంలో మొదటిసారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ దాడిలో దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్‌ చేసారు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యాయి.

సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో నెలరోజులు కాపు కాసి శ్రీనివాస్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు విజయవాడలో పట్టుకున్నారు. ఈ స్థాయిలో అమ్మకాలు జరుపుతూ పట్టుబడటం దేశంలో మొదటిసారని పోలీసు అధికారులు చెప్పారు. ఈ దాడిలో దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్‌ చేసారు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యాయి. లక్ష్మీ కటాక్షం, పెళ్ళి కావటం, పిల్లలు పుట్టడం, భార్యభర్తలు కలిసి ఉండాలంటే ఇవి ఇంట్లో ఉంటే మంచిదంటూ యూట్యూబ్ ద్వారా విస్తృత ప్రచారం చేసాడు నిందితుడు శ్రీనివాస్. యూట్యూబ్ లో వీటి అమ్మకాలు చూసి స్వయంగా వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ రంగంలోకి దిగింది. జింక చర్మాలు, అడవి నక్క తోకలు, ముళ్ళ పంది ముళ్లు, పాము కుసుములు వంటి కోటి విలువైన వాటిని అధికారులు సీజ్ చేసారు. తెలంగాణ లోని వరంగల్ కు చెందిన శ్రీనివాస్ వెనుక స్మగ్లింగ్ ముఠా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడలో అక్షయ నిధి మార్ట్ పేరుతో ఏడాదిగా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మేడారం జాతరలో ఇవి కొన్నట్టు అధికారులకు శ్రీనివాస్ తెలిపాడు. సముద్ర గర్భంలో ఎకో సిస్టం సరిచేసే సీ ఫ్యాన్స్ ను బయటకు తేవటమే అత్యంత క్లిష్టమని అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న వైల్డ్ లైఫ్ ప్రాణుల జాబితాలో సీ ఫ్యాన్స్ కూడా ఒకటి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Elon Musk: ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ

ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. బెండ కాయలు కేజీ రూ.650లు

Nagarjuna: చెప్పినట్టే తప్పు దిద్దుకున్న నాగార్జున.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఏపీలో డయేరియా.. డేంజర్‌ బెల్స్‌ .. చికెన్‌, మటన్‌ అమ్మకాలు బంద్‌

SS Rajamouli: ప్రౌడ్ మూమెంట్.. ఆస్కార్‌ అకాడమీలో భాగమైన జక్కన్న!

Follow us on