గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

Updated on: Jan 20, 2026 | 12:31 PM

వేంపల్లిలో గంజాయి విక్రేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఐ నరసింహులు ఆధ్వర్యంలో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి, 1.05 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పట్టణంలో ఊరేగించారు. భవిష్యత్తులో ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.

వేంపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయాలు జరిపినా లేదా గంజాయి వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని వేంపల్లి సీఐ నరసింహులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ఆధ్వర్యంలో సీఐ నరసింహులు స్టేషన్ సిబ్బంది గంజాయి విక్రయాలు జరుపుతున్న, గంజాయి సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వేంపల్లి పట్టణంలో నడిపిస్తూ ఊరేగించారు. మరోసారి గంజాయి విక్రయాలకు పాల్పడినా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. రాయచోటి నుండి వేంపల్లి పట్టణానికి గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న బాబా ఫక్రుద్దీన్ షేక్ ఆదిల్, ఖానాల గణేష్ రెడ్డి అని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 1.05 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరోసారి గంజాయి విక్రియాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వారిని వేంపల్లి పట్టణంలో నడిపిస్తూ ఊరేగించారు. ఎవరైనా సరే చట్టానికి లోబడి నడుచుకోవాలని చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఘాటుగా స్పందించారు.గంజాయి ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయ లేదా వినియోగ సమాచారాన్ని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియచేయాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!

మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

WhatsApp: యూజర్లకు వాట్సప్ గుడ్‌న్యూస్ గ్రూప్ చాటింగ్ ఫీచర్స్‌‌లో అప్‌డేట్స్

Published on: Jan 20, 2026 12:28 PM