ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

Phani CH

|

Updated on: Dec 27, 2024 | 1:27 PM

బీటౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్. ఇందులో సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్నారు వరుణ్, కీర్తి. హీరో వరుణ్ ధావన్ తన తోటి హీరోయిన్లతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ హద్దులు దాటుతున్నాడని.. వారితో అనుచితంగా ప్రవర్తిస్తాడనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

ఇదే విషయంపై సోషల్ మీడియాలో అనేకసార్లు విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు వరుణ్‌. ఈ క్రమంలోనే బేబీ జాన్ ప్రమోషన్స్‌లో కూడా ఈ హీరోకు ఇదే ప్రశ్న ఎదురైంది. గతంలో హీరోయిన్ కియారా అద్వానీ అనుమతి లేకుండానే ఆమె చెంపపై ముద్దుపెట్టాడు. లైవ్ ఈవెంట్లో హీరోయిన్ అలియా భట్ నడుముపై చేసి వేశాడు. దీంతో అప్పట్లో వరుణ్ ధావన్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో తన ప్రవర్తనపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన ఒకే ఒక్క హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ కూల్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!

TOP 9 ET News: సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే

Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్‌ అవుతున్న సాయిపల్లవి