వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం!

Updated on: Jun 08, 2026 | 3:26 PM

కాచిగూడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలో ట్రాక్‌పైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ప్రమాదంతో రైలు ముందుభాగం దెబ్బతినడంతో పాటు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రైలును హిందూపురం స్టేషన్‌కు తరలించి మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మరో ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తున్న వందే భారత్ రైలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్‌పైకి హఠాత్తుగా వచ్చిన ఒక గేదెను ఈ హైస్పీడ్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గేదెను ఢీకొన్న వేగానికి వందే భారత్ రైలు ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. అంతేకాకుండా ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో లోకోపైలట్ అప్రమత్తమై రైలును వెంటనే నిలిపివేశారు. ఊహించని విధంగా రైలు ఆగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా ఏం జరిగిందో తెలియక కాసేపు కంగారు పడ్డారు. అనంతరం రైలును నెమ్మదిగా హిందూపురం రైల్వే స్టేషన్‌కు తరలించారు. రైల్వే సాంకేతిక సిబ్బంది, ఇంజనీర్లు వెంటనే రంగంలోకి దిగి దెబ్బతిన్న ముందుభాగాన్ని, ఇంజన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట పాటు హిందూపురం స్టేషన్‌లోనే నిలిచిపోయిన వందే భారత్ రైలు, సిబ్బంది క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత తిరిగి బెంగళూరుకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మారిన స్కూల్‌ రీ ఓపెనింగ్‌ డేట్‌

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!

షాకింగ్‌ న్యూస్‌.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్‌ ధర.. ఎంతంటే?

Follow Us