Cancer-Sugar: క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.! షుగర్ కు కూడా..

|

Dec 23, 2024 | 9:55 AM

క్యాన్సర్ పేరు చెబితేనే కాళ్లు, చేతులు వణికిపోతాయి చాలామందికి. ఎందుకంటే.. అది వచ్చిందంటే ఆ నరకం ఎలా ఉంటుందో బాధితులకు బాగా తెలుసు. అందుకే క్యాన్సర్ రాకుండా ఉంటే చాలు అని చాలా మంది భావిస్తారు. దీనికోసం ముందు నుంచీ ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటివారందరికీ ఇది నిజంగా శుభవార్తే. రష్యాలో క్యాన్సర్ కు వ్యాక్సిన్ ను తయారుచేశారు.

క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో నిజంగా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ను ఢీకొట్టే MRNA వ్యాక్సిన్ ను.. అక్కడి రీసెర్చ్ సంస్థలు అన్నీ కలిసి డెవలప్ చేశాయి. కొత్త సంవత్సరంలో దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు. రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్.. ఆండ్రే కాప్రిన్ చెప్పినదానిని బట్టి చూస్తే.. ఈ వ్యాక్సిన్ ను పూర్తి ఉచితంగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ చేసే పనేంటంటే.. శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది. దానిని ఢీకొట్టి.. నాశనం చేసేలా.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తుంది. సో.. సింపుల్ గా చెప్పాలంటే MRNA వ్యాక్సిన్ చేసే పని ఇదే. ఈ పరిశోధనల్లో తేలిన విషయం ఏంటో కూడా చెబుతాను. క్యాన్సర్ కణతులు అభివృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంటుంది. రోగ సంబంధ కణాల వ్యాప్తినీ ఆపేస్తుంది. ఈ రెండు పనులను చేయడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు బాగుందని.. అక్కడి క్లినికల్ ట్రయల్స్ లో నిరూపణ అయ్యింది. అందుకే ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పారు. తాము క్యాన్సర్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నామని గర్వంగా చెప్పారు. ఇప్పటికీ దీనికి పేరు పెట్టలేదు. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. రష్యాలో 2022 సంవత్సరంలో ఆరు లక్షల 35 వేల కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి ఆ దేశంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్యాన్సర్ కు వ్యాక్సిన్లను తయారుచేయడానికి చాలా దేశాలు సొంతంగానే పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో కొన్ని రకాల క్యాన్సర్లకు టీకాలను ఇప్పటికే అభివృద్ధి చేశారు. బ్రెయిన్ క్యాన్సర్ లో ఓ రకమైన గ్లియోబ్లాస్టోమాకు కూడా వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు. దీనిని టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. ఇక చర్మ క్యాన్సర్ అయిన మెలనోమాకు యూకేలో ఓ వ్యాక్సిన్ ను తయారుచేశారు. దీనిని కూడా టెస్ట్ చేశారు. బాధితులు వేగంగా కోలుకునే ఛాన్స్ పెరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. దీంతో వారిలో ఆశలు పెరిగాయి. తాము త్వరగా కోలుకోగలం అన్న నమ్మకం పెరిగింది. నిజానికి క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సిన్ పాత్రను ఏమాత్రం కొట్టిపారేయలేం. వీటి ముఖ్యమైన లక్ష్యం, లక్షణం ఒక్కటే.. క్యాన్సర్ కణాలపై ఉండే ప్రొటీన్లు, యాంటీజెన్లను టార్గెట్ చేసుకుని.. వాటిని కిల్ చేసేలా.. శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తాయి. క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే దానిని తొలగించేలా.. క్యాన్సర్ కణతులు స్పీడ్ గా పెరగకుండా వాటిని అడ్డుకునేలా.. ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దీనికోసం ఈ టీకాల్లో మాడిఫై చేసిన, లేదా పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్ లను యూజ్ చేస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.