రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి కలకలం

Updated on: Jan 01, 2026 | 8:07 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి మొక్కల సాగును పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేందర్ అనే యువకుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ల పేరుతో గంజాయిని పెంచుతూ స్థానిక యువతకు సరఫరా చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో గంజాయి సాగు కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్‌పూర్‌లోని ఒక ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి మొక్కల సాగును గుర్తించారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేందర్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో రాజేందర్ తన ఇంట్లోనే గంజాయిని సాగు చేస్తూ, దానిని స్థానిక యువకులకు సరఫరా చేస్తున్నాడని వెల్లడైంది. అతను ఆయుర్వేదిక్ మెడిసిన్లను విక్రయిస్తున్నట్లు నటిస్తూ, వాటి పేరుతో గంజాయి మొక్కలను పెంచుతున్నాడని పోలీసులు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి

ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..