బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!

|

Sep 20, 2023 | 9:49 AM

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విషాదకరఘటన జరిగింది. ఓ మహిళ తన కాళ్లూచేతులు పోగొట్టుకుంది. బ్యాక్టీరియా సోకిన చేపను సరిగా ఉడికించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల లారా బరాజాస్‌కు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విషాదకరఘటన జరిగింది. ఓ మహిళ తన కాళ్లూచేతులు పోగొట్టుకుంది. బ్యాక్టీరియా సోకిన చేపను సరిగా ఉడికించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల లారా బరాజాస్‌కు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన టిలపియా చేప తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారని లారా స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు వెల్లడించారు. ఆమె ప్రాణాలు పోయినంత పనైందని కొంతకాలం పాటు ఆమె రెస్పిరేటర్‌పై ఉందని అన్నారు. డాక్టర్లు ఆమెను వైద్యపరమైన కోమాలో ఉంచారని ఆమె కింది పెదవి, వేళ్లు, పాదాలు నల్లగా మారాయని . కిడ్నీల పనితీరు కూడా దెబ్బతిందని తెలిపారు. అలాగే శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయిందని ఈ ఘటన తమకు భయానక అనుభవం మిగిల్చిందని ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు

Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు

Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!

Follow us on