ఉగాది పంచాంగం 2025: కన్య రాశి వారికి ఈ ఉగాది నుండి ఉద్యోగాల పరంగా ఎలా ఉంటుందంటే ??

Updated on: Mar 29, 2025 | 1:06 PM

కన్య రాశికి సప్తమ స్థానంలోకి శని, దశమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

మే 18న ఆరవ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే అనుకూలంగా కొనసాగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనేక విధాలుగా శుభ ఫలితాలు కలుగు తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉగాది పంచాంగం 2025: వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ??

శని గ్రహం చుట్టూ ఉండే రింగ్‌ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా

వేదికపై వధూవరుల ఫోటో సెషన్‌.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి

అసహ్యకరమైన చేప.. చూస్తేనే ఒళ్లంతా వణుకు!

బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??