Betel Leaf: నోరు పండుతుందని కిళ్లీ వేసుకుంటే.. ప్రాణాలే పోయాయి.. అసలేం జరిగిందంటే..?
భారతీయ సంప్రదాయంలో తమలపాకులకు చాలా ప్రధాన్యత ఉంది. శుభకార్యాలు, వేడుకలు, పూజలు, పర్వదినాలు.. ఇలా అకేషన్ ఏదైనా సరే తమలపాకులను ఉపయోగించడం కామన్. అంతే కాకుండా ఆకులకు సున్నం రాసి..
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండావారిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు భోజనం చేసిన తర్వాత తాంబులం వేసుకున్నారు. కాసేపటికే వారికి ఒక్కసారిగా వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించి బావ కృష్ణమూర్తి మృతి చెందగా.. స్పగ్రామానికి చేరుకున్నతర్వాత బావ మరిది కనక రాజుకూడా చనిపోయాడు. కిళ్లీ వేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు చనిపోవడం ఆ గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తాంబూలం వేసుకున్నందునే చనిపోయారా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఒకే కుటుంబలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
