AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Arjun: లేటెస్ట్ నేషనల్ క్రష్‌గా చలామణి అవుతున్న సారా అర్జున్

Sara Arjun: లేటెస్ట్ నేషనల్ క్రష్‌గా చలామణి అవుతున్న సారా అర్జున్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 8:23 PM

Share

త్రిప్తి దిమ్రి, సారా అర్జున్ - ఇద్దరు యువ నటీమణులు సినీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నారు. 'యానిమల్'తో త్రిప్తి, 'ధురంధర్'తో సారా నేషనల్ క్రష్‌లుగా మారారు. వారి బోల్డ్ నటన, విభిన్న పాత్రల ఎంపిక దక్షిణాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. వారి హఠాత్ కీర్తి, తదుపరి ప్రాజెక్ట్‌లపై అంచనాలు పెంచుతున్నాయి. సౌత్ లో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

కొడ్తే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాక్‌ అవ్వాలనే డైలాగు మనకి బాగా తెలుసు. మరి యానిమల్‌ బ్యూటీకి త్రిప్తి దిమ్రికి తెలుసా? దురంధర్‌ లేడీకి పరిచయం ఉంటుందా? అసలు ఆ మాట వినకుండానే వాళ్లు అంత క్రేజ్‌ తెచ్చేసుకున్నారా? కమాన్‌ లెట్స్ వాచ్‌… యానిమల్‌ సినిమాలో త్రిప్తి దిమ్రిని చూసిన వాళ్లందరూ ఇంత బోల్డ్ గా ఎలా యాక్ట్ చేశారని ఆశ్చర్యపోయారు. నయా నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ ని అప్పటికప్పుడు ఇచ్చేశారు. ఆ సినిమా నార్త్ లోనే కాదు, సౌత్‌ ఆడియన్స్ లోనూ అదే రేంజ్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది త్రిప్తికి. ఇప్పుడు స్పిరిట్‌లోనూ అంతకు మించిన సన్నివేశాలుంటాయనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కంటెంట్‌ కాస్త బోల్డ్ గా ఉందని ఆల్రెడీ దీపికా పదుకోన్‌ లీక్‌ ఇచ్చేశారు. దానికి తోడు త్రిప్తి హీరోయిన్‌ అనేసరికి, అంఛనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. సడన్‌గా స్క్రీన్‌ మీదకు దూసుకొచ్చి ఆ రేంజ్‌లో క్లిక్‌ అయిన లేడీగా ఆమె పేరు తెచ్చుకున్నారు. త్రిప్తి తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్నారు సారా అర్జున్‌. ధురంధర్‌ సినిమాలో ఆమెను చూసినప్పుడు బేబీ సారా ఇంత ఎదిగిపోయారా? అని వావ్‌ అయ్యారు జనాలు. ధురంధర్‌లో ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు. నయా నయా నేషనల్‌ క్రష్‌ అంటూ ఈ సారి నేషనల్‌ క్రష్‌ ట్యాగ్‌ని ఇటు షిఫ్ట్ చేశారు. కంప్లీట్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ సినిమాలో, అభిమానుల చూపులను తన వైపు తిప్పుకోగల నటన ఆమె సొంతం అంటూ క్రిటిక్స్ తో ప్రశంసలు అందుకున్నారు సారా. కెరీర్‌ బిగినింగ్‌ స్టేజ్‌లోనే తల్లి కేరక్టర్‌ చేయడం డేరింగ్‌ స్టెప్పేననే అప్లాజ్‌ కూడా అందుకున్నారు. అటు త్రిప్తి, ఇటు సారా.. సౌత్‌లో ఎలా హల్‌చల్‌ చేస్తారో చూడాలని దక్షిణాది మొత్తం వెయిటింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us