Telangana: తెలంగాణ చెరువులో యుద్ధ ట్యాంకర్లు.! రష్యా టెక్నాలజీతో ఓడీఎఫ్‌లో తయారీ.
నీళ్లలో ఏడు నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాయని, అలాగే రోడ్డుపై 30 కిలోమీటర్ల వేగంతో ఈ యుద్ధ ట్యాంకర్లు ప్రయాణిస్తాయని ఓడీఎఫ్ అధికారులు తెలిపారు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపకరిస్తాయని, ఈ వాహనాలు రష్యా టెక్నాలజీని ఉపయోగించామన్నారు. ఇప్పటివరకు 2వేల వాహనాలకు పైగా మెదక్ ఓడీఎఫ్ నుంచి సైన్యానికి పంపినట్లు వారు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యింది. కంది మండలం ఎద్దుమైలారం లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో తయారైన ఈ యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేశారు. ఇందులో బీఎంపీ కన్వర్షన్ వెహికల్, బీఎంపీ ఓవరాయిలింగ్ వెహికల్స్‌ని పరీక్షించారు. నీళ్లలో ఏడు నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాయని, అలాగే రోడ్డుపై 30 కిలోమీటర్ల వేగంతో ఈ యుద్ధ ట్యాంకర్లు ప్రయాణిస్తాయని ఓడీఎఫ్ అధికారులు తెలిపారు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపకరిస్తాయని, ఈ వాహనాలు రష్యా టెక్నాలజీని ఉపయోగించామన్నారు. ఇప్పటివరకు 2వేల వాహనాలకు పైగా మెదక్ ఓడీఎఫ్ నుంచి సైన్యానికి పంపినట్లు వారు తెలిపారు. ఓడీఎఫ్‌లో ఒకసారి తయారైన వాహనాలను 15 నుంచి 20 సార్లు వివిధ రకాల టెస్ట్‌లు చేసిన తర్వాతే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే భారత మిలిటరీకి పంపడం జరుగుతుందన్నారు. యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.