వారానికి రెండు రోజులు ఉపవాసం చేసి చూడండి.. మిమ్మల్ని మీరే నమ్మలేరు

Updated on: Feb 24, 2025 | 9:43 PM

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో సైన్స్‌ దాగుందనేది నిపుణుల అభిప్రాయం. ఇందులో ఉపవాసం కూడా ఒకటి. కొంతమంది వారంలో త‌మ‌కు ఇష్ట‌మైన రోజు లేదా ఇష్ట‌దైవానికి పూజ చేసిన రోజు ఉప‌వాసం పాటిస్తుంటారు. ఉప‌వాసం చేయ‌డం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్ర‌మే కాదు, సైన్స్ ప‌రంగా కూడా అనేక విష‌యాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు.

వారంలో ఒక రోజు ఉప‌వాసం చేస్తే అనేక లాభాలు ఉంటాయ‌ని సైన్స్‌ చెబుతోంది. అయితే వారంలో ఒక రోజు కాకుండా వారంలో 2 రోజుల పాటు ఉప‌వాసం చేస్తే ఎన్నో అద్భుత‌ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. వారంలో క‌నీసం రెండు రోజుల పాటు ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో కొవ్వు క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారికి ఉప‌వాసం ఎంతో మేలు చేస్తుంది. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. త‌ర‌చూ వారు ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మాత్ర‌మే ఇది మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IT రిటర్న్‌లు ఆలస్యమైతే రిఫండ్‌ రాదా ??

కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!

మట్టి ఇంట్లో నివాసం.. రూ. 2 కోట్ల జాబ్‌ కొట్టిన టెకీ

జామ పండు.. యాపిల్​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి