బీరకాయా.. అని తీసిపారేయకండి.. అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు
ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పోషకాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగ్గా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.
బీరకాయలో నీరు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీరకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం బాధితుల్లో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో చరంటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్ధాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. బీరకాయలో ఉండే అధిక పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: