Tomato: ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
టమోటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కిలో రూపాయి, అర్ధ రూపాయి పలుకుతోంది. దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మదనపల్లి తర్వాత ఏపీలో టమాటో అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లా రైతులే. పత్తికొండ, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, మద్దికేర, తుగ్గలి, ఆదోని, అలహర్వి, ప్యాపిలి డోన్ తదితర ప్రాంతాల్లో టమోటాను గణనీయంగా పండిస్తున్నారు. ఈసారి ధరలు కాస్త ఆశాజనకంగా ఉండటంతో రైతులు మరింతగా ఈ పంటపై ఆసక్తి చూపించారు. కానీ వారు ఊహించని పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అక్టోబర్ 7న కర్నూలు రైతు బజార్లో కిలో టమోటా ధర 50 రూపాయలు ఉండగా… డిసెంబరు 1న అదే రైతు బజార్లో కిలో టమోటా 38 రూపాయలకు చేరింది. డిసెంబరు 10 నాటికి 16 రూపాయలకు పడిపోయింది. ఇది రిటైల్ మార్కెట్ ధర. ఇక ఓపెన్ మార్కెట్లో కిలో టమాట 20 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. డోన్ లో 15, బనగానపల్లెలో 16, ఆదోనిలో 18 రూపాయలకు వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. కానీ టమోటా పండించే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల నుంచి టమోటా కొనుగోలు కేంద్రమైన పత్తికొండలో సోమవారం సాయంత్రం కిలో టమోటా రూపాయి, అర్ధ రూపాయికి పడిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు కిలో ఆరు రూపాయల చొప్పున అమ్మిన టమోటా టైమ్ గడుస్తున్న కొద్దీ ఒక రూపాయికి పడిపోయింది.
టమోటా ఎర్రగా ఉండటం, సన్నగా ఉండటం, పూర్తి పండుగా మారడం, క్వాలిటీ తగ్గడంతో కొనేవారు లేక ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆస్పరి టమోటా మార్కెట్లో కిలో రెండు నుంచి నాలుగు రూపాయలు పలుకుతోంది. ప్యాపిలీ మార్కెట్లో మరికొంత ఆశాజనకంగా ఉంది. కిలో ఎనిమిది నుంచి పది రూపాయలకు విక్రయాలు జరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. అయితే వివిధ మార్కెట్లలో క్వాలిటీని బట్టి ధరలు ఉంటున్నాయని , రైతుకు ఇస్తున్న ధరకు వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రైతుకు యావరేజ్ గా రెండు నుంచి ఐదు రూపాయలు పడుతుంటే అదే వినియోదారుడు మొత్తం 20 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్టుగానే టమోటాకు కూడా కిలో కనీసం 10 రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టమోటా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.