తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

Updated on: Dec 15, 2025 | 9:18 PM

దక్షిణ మధ్య రైల్వే తిరుమల భక్తులకు శుభవార్త ప్రకటించింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతి-చర్లపల్లి, పండరీపూర్-తిరుపతి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. డిసెంబర్ 16 నుండి జనవరి 4 వరకు సేవలు అందిస్తాయి. ప్రయాణ తేదీలు, వేళలు స్పష్టంగా ఉన్నాయి. ఇది భక్తుల సౌకర్యార్థం తీసున్న నిర్ణయం.

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల వెళ్లే ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో న్యూఇయర్, సంక్రాంతి వరుస పండుగలు క్యూ కడుతున్న నేపథ్యంలో తిరుపతి వెళ్లేవారికి కోసం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. తిరుమలకు రోజు లక్షలాది మంది ప్రజలు వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ఇక వేల మంది తరచూ తిరుపతి వెళ్తుంటారు. దీంతో తిరుపతి వెళ్లే ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో అటువైపు ప్రత్యేక సర్వీసులను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది రైల్వే. తాజాగా మరో మూడు స్పెషల్ రైళ్లను తీసుకొచ్చింది. తిరుపతి-చర్లపల్లి రైలు డిసెంబరు 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఇక చర్లపల్లి-తిరుపతి రైలు 19వ తేదీ నుంచి జనవరి 2 వరకు సర్వీసులు అందించనుంది. ఈ ట్రైన్ చర్లపల్లిలో సాయంత్రం 3:30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక పంధర్‌పూర్-తిరుపతి ట్రైన్ డిసెంబరు 21వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. ఇది పంధర్‌పూర్‌లో రాత్రి 08:00 గంటలకు బయల్దేరి తర్వాత రోజు రాత్రి 10:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ ట్రైన్లు దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??

200 ఏళ్ల నాటి అరుదైన శంఖం… ఏడాదికి ఒక్కసారే…

ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

ప్రపంచంలోనే ‘లాంగెస్ట్‌’ ఫ్లైట్ చూసారా..

Sankranti 2026: మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలంటే..