తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు
తిరుమల గిరులపై వన్యప్రాణులు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటి వరకూ చిరుతలు, ఎలుగుబంట్లు స్థానికులను, భక్తులను భయభ్రాంతులకు గురి చేసాయి. నడకదారిలో వెళ్తున్న భక్తులపై దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. అటవీ అధికారులు పులులను బంధించి, భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతూనే ఉన్నారు.
ప్రస్తుతం చిరుతల బెడద సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు పాముల బెడద మొదలైంది. నడకమార్గంలో, అక్కడి దుకాణాల్లో కొండచిలువలు, నాగుపాములు దర్శనమిస్తున్నాయి. స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ లోని ఒక ఇంటిలో నాగుపాము బుసలు కొట్టింది. ఇంటి నెంబర్..1022 లో తిష్టవేసిన 8 అడుగుల పొడవైన నాగుపామును చూసి ఆ ఇంటిలోనివారు భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే, పాపనాశనము వద్ద మరో పాము భక్తుల కంటపడింది. అక్కడ 6 అడుగుల నాగుపామును గుర్తించిన దుకాణదారులు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది భాస్కర్ నాయుడుకు కాల్ చేశారు. బాలాజీనగర్‌లో పామును పట్టడంలో బిజీగా ఉన్న భాస్కర్ నాయుడు 8 అడుగుల నాగుపామును బంధించి అక్కడినుంచి క్షణాల్లో పాపనాశనం వద్దకు చేరుకున్నాడు. అక్కడ స్థానికుల అలికిడికి బుసలుకొడుతున్న నాగుపామును సేఫ్‌గా బంధించాడు. ఇలా రెండు పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వాటిని సేఫ్ గా శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు భక్తులు, స్థానికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే
