అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే
అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించాయి. మొదట వాటిని బాణాసంచా కాల్పులు అనుకున్న స్థానికులు ఆ కాంతి పుంజాలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ మండుతున్న గీతలను చూసి జనం ఆశ్చర్యపోయారు. అది ఉల్కాపాతమా లేక అంతరిక్ష శిథిలాలా? అన్నది అర్థం కాలేదు. ఈ కాంతి వెలుగుల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో ఆకాశంలో ఈ కాంతి పుంజాలు కనిపించాయి. మండుతున్న గీతల మాదిరిగా దూసుకొచ్చాయి. ఆకాశంలో మెల్లగా వెళ్తున్న చిన్న చిన్న లైట్ల మాదిరిగా కొంతసేపు కనువిందు చేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. నైట్ షిఫ్ట్‌ల తర్వాత ఇళ్లకు వెళ్లే వారు వీటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఉల్కాపాతమని చాలామంది భావించారు. అయితే చైనాకు చెందిన సీజెడ్-3బీ రాకెట్ శకలాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇలా మండినట్లు గ్రోక్ పేర్కొంది. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ కాంతి పుంజాల వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష రూపాయలకే 5 బుల్లెట్ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

