Loading video

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

|

Mar 23, 2025 | 1:10 PM

ఇటీవల ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి చిరుతపులులు, పులులు, ఇతర జంతువులు. ఈ క్రమంలో పశువులను చంపి తింటున్నాయి. కనిపించిన మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఒక్కోసారి ఈ జంతువులే ప్రమాదాల్లో పడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కేరళలో. జనావాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకునే క్రమంలో అటవీశాఖ అధికారులపై దాడి చేసింది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

పులిని పట్టుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం వారు దాన్ని కాల్చి చంపారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఇటీవల సమీప జనావాసాల్లోకి వచ్చిన పులి అక్కడ కొన్ని పశువులను చంపి తినేసింది. స్థానికుల సమాచారంతో పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మార్చి 17 సోమవారం ఉదయం పులి ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించారు. దానికి మత్తుమందు ఇవ్వడానికి 15 మీటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. దాంతో అది ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో పులి మృతి చెందినట్లు అటవీశాఖ సీనియర్‌ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో

తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

ఈ కోతికి ఫోన్‌ కనిపిస్తే చాలు.. వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో