ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ..ఏడాది సంపాదన ఎంతో తెలుసా?
దేశంలో నిరుద్యోగ సమస్య ఆకాశాన్ని అంటుతోంది. డిగ్రీలు, పీజీలు చేసిన యువతలో అనేకులు రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఇంకొందరు చదివిన చదువుకు సంబంధం లేని చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ రాజీపడి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇంట్లో ఉండే నలుగురూ ఏదో ఒక పని చేసి నాలుగు రూపాయలు తెస్తే తప్ప.. ఆ కుటుంబానికి రోజు గడవని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో.. ముంబైలోని ఓ సాదాసీదా వ్యక్తి ఏటా రూ.7.5 కోట్లు సంపాదిస్తూ అందరిచేతా ‘ఔరా’ అనిపించుకుంటున్నాడు. మన దేశంలోని అనేక కార్పొరేట్ కంపెనీల అధిపతులు ఏటా తీసుకునే వేతనాల కంటే ఇది ఎక్కువ కావటం విశేషం. ఇంతకీ ఆ వ్యక్తి ఆదాయమార్గం ఏమిటో తెలుసా?.. బిచ్చమెత్తుకోవటం. యస్.. మీరు వింటున్నది నిజమే. ఈ బిచ్చగాడు రోడ్డు మీద అడుక్కుంటూ ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. మనోడు ప్రపంచంలోనే సంపన్న బిచ్చగాడిగానూ రికార్డుకెక్కాడు. ఇక.. మనం మాట్లాడుకుంటున్న ఈ బిచ్చగాడి పేరు.. భరత్ జైన్. పేద కుటుంబంలో పుట్టిన జైన్ ఆకలికి తాళలేక భిక్షాటనను వృత్తిగా మలచుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తున్నాడు. రోజుకు రూ.2,000 నుండి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు. తాను సంపాదించిన డబ్బును వృధా చేయకుండా.. ఎప్పటికప్పుడు తెలివిగా మదుపు చేసి..అనేక ఆస్తులను కొనుగోలు చేశాడు. తన ఇద్దరు కొడుకులనూ ప్రఖ్యాత స్కూళ్లలో చదివించటమే గాక..ఆలయాలు, దాతృత్వ సంస్థలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. జీవితంలో బాగా స్థిరపడినా.. మనోడు మాత్రం భిక్షాటనను వదులుకోవడం లేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
