ఆకట్టుకుంటున్న కదంబ గణపతి.. అమ్మవారికి ఇష్టమై పుష్పాలతో రూపొందిన గణేషుడు
వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకునేందుకు ఆ లంబోదరుడు వివిధ రూపాలలో కొలువుదీరాడు. పర్యావరణ హితం కోరి పలుచోట్ల భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తే.. కొందరు వివిధ రకాల వస్తువులతో, భిన్న రూపాలలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది.
ఎందుకంటే ఈ గణపతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో తీర్చిదిద్దారు. కదంబ కుసుమ ప్రియా అని లలితా అమ్మవారిని స్తుతిస్తాం.. అంతేకాదు ఈ పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పురాణాల్లోనూ ఈ కదంబ వృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఎన్నో ఔషధాలు కలిగిన మొక్కగానూ ఈ కదంబ వృక్షానికి పేరుంది. తెల్లని తెలుపుతో ఈ పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చని రంగుతో బంతుల మాదిరిగా ఉంటాయి. క్రమంగా పసుపుపచ్చగా మారి, చివరిగా తెలుపు వర్ణంతో పూబంతిలా మారుతుంది. ఈ పుష్పం ఆకారంలోనే కాదు సువాసనలోనూ ప్రత్యేకమైనవే. వర్షాకాలంలో ఎక్కువగా విరగబూసే ఈ పూలు లక్ష్మీ పూజలో ప్రధానంగా నిలుస్తాయి. అంతటి విశిష్టమైన కదంబ పూలతో వినాయకుని రూపొందించి పూజలు చేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామ ప్రజలు. ఉద్దానం యూత్ క్లబ్ వారు ఏటా భిన్న రూపాలలో గణపతిని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది కదంభం పుష్పాలతో తీర్చిదిద్దిన గణనాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో
కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!

