అక్కడ పార్క్‌ చేశారంటే.. మీ బైక్‌ సీదా అస్సాంకే

|

Sep 09, 2024 | 8:46 PM

హైదరాబాద్‌లో బైక్ చోరీ చేసే ముఠాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైకులను నిందితులు కాజేస్తున్నారు. మెట్రో స్టేషన్ల పార్కింగ్‌లో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠా ఇటీవల పోలీసులకు చిక్కింది. తన బైక్‌ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు వెల్లువలో ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువగా మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలే మాయమవుతున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో బైక్ చోరీ చేసే ముఠాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైకులను నిందితులు కాజేస్తున్నారు. మెట్రో స్టేషన్ల పార్కింగ్‌లో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠా ఇటీవల పోలీసులకు చిక్కింది. తన బైక్‌ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు వెల్లువలో ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువగా మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలే మాయమవుతున్నట్లు గుర్తించారు. దీంతో మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను కనిపెట్టారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు ఇలాంటి చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరాల ద్వారా లభించిన ఆధారాలతో పాటు సాంకేతిక ఎవిడెన్స్‌ను బట్టి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్‌లను చోరీ చేసి ఇతర జిల్లాలకు వాటిని తరలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నాగోల్, ఎల్బీనగర్‌ వంటి మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైకులను అపహరించిన దుండగులు వాటిని నల్లగొండకు తరలించారు. తాజాగా ఖమ్మంలోని అశ్వరావుపేటలో మరికొన్ని చోరీకి గురైన బైకులను పోలీసులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాయుకాలుష్యం.. పురుషులపై ఎఫెక్ట్‌ !! 5 లక్షల మందిపై అధ్యయనం

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్

అవును.. రాజ్‌తరుణ్‌ నిందితుడే పోలీసుల చార్జిషీట్‌

కోల్‌కత ట్రైనీ డాక్టర్‌ పై జరిగింది గ్యాంగ్ రే***ప్‌ కాదా ??

66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా

Follow us on