నానబెట్టిన వాల్‌నట్స్, నానబెట్టిన బాదం.. వీటిలో ఏది తింటే బరువు తగ్గుతారు?వీడియో

Updated on: Oct 04, 2025 | 4:09 PM

నానబెట్టిన వాల్‌నట్స్, బాదం రెండూ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలనిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, పోషకాలను సులభంగా అందిస్తాయి. వాల్‌నట్స్ మెదడుకు, గుండెకు మేలు చేయగా, బాదం బరువు తగ్గడానికి, షుగర్ నియంత్రణకు, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం ముందు నానబెట్టిన బాదం శక్తినిస్తుంది.

ఆరోగ్య స్పృహ పెరిగిన ఈ కాలంలో నట్స్ వినియోగం అధికమైంది. చిన్నవిగా కనిపించే ఈ గింజలు అపారమైన పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని నానబెట్టి తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి, పోషకాలు మరింత సులభంగా శరీరానికి అందుతాయి. ముఖ్యంగా గుండె మరియు మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.నానబెట్టిన వాల్‌నట్స్ మరియు బాదం రెండూ వాటి ప్రత్యేక ప్రయోజనాలతో మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, శరీరంలో వాపును తగ్గిస్తాయి. నానబెట్టిన వాల్‌నట్స్ బ్రెయిన్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయని, వయసు సంబంధిత బ్రెయిన్ డ్యామేజ్ నుండి కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. వాటి ఆకారం కూడా మెదడును పోలి ఉండటం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో