Covid Vaccine: MRNA కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు.. కోట్లమందిలో కొత్త టెన్షన్.!
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా ? ఆ వ్యాక్సిన్.. ఆ కంపెనీదేనా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. టీకాలు వేసుకున్నవారిని భయపెట్టే వార్త ఇది. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ షార్ట్‌ఫామ్‌లో ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఎంఆర్‌ఎన్‌ఏ తరహా కొవిడ్ టీకాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలంటూ వైద్య, ఆరోగ్య నిపుణులు సంతకం చేసిన ‘హోప్ అకార్డ్’ పిటిషన్ తాజాగా పిలుపునిచ్చింది.
ఇప్పటికే ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోట్లమందిపై బాంబు పేల్చింది. తాము రూపొందించిన కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్-TTSకు కారణమవుతుందని ఇటీవలె అంగీకరించింది. టీటీఎస్‌వల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆస్ట్రాజెనెకా తరాహాలోనే తాజాగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు సైతం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అనేక ప్రమాదాలు ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. టీకాలపై తిరిగి సమగ్రమైన అధ్యయనం జరపాలని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ టీకాలకు భిన్నమైనవి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు. వీటితో ఏర్పడే దుష్ప్రభావాల్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా వినియోగంలోకి తీసుకొచ్చారని పలు అధ్యయనాలు సైతం తెలిపాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.