Tenali: తెనాలి లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ వద్ద ఎండిఎంఏ డ్రగ్స్‌తో నలుగురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్‌లో తరలించిన సుమారు 5 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై విచారణ కొనసాగుతోంది.
గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్‌ను కలిగి ఉన్న నలుగురు యువకులను తెనాలి త్రీ టౌన్ పోలీసులు మరియు ఈగల్ టీం సంయుక్తంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని సోదా చేయగా, వారి వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రహస్యంగా తెనాలికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 5 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు
Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్