రెడ్ అలెర్ట్.. మళ్ళీ భారీ ముప్పు తప్పదా ??
ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి...తెలంగాణ వైపు దూసుకొచ్చింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు.
ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి…తెలంగాణ వైపు దూసుకొచ్చింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. సూర్యాపేట, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కొమురం భీమ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు
మొంథా ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??
