Telangana Assembly: బిగ్‌ డే.. పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2025 | 7:16 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజుకు చేరాయి. అధికార కాంగ్రెస్ ఇవాళ్టి సెషన్‌ను బిగ్‌ డేగా భావిస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం అనంతరం.. కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ముందుగా ప్రభుత్వం, పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ, బీసీలకు 42%రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. బిల్లులను సభ ఆమోదించింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండురోజు ప్రారంభమయ్యాయి.. ముందుగా ప్రభుత్వం, పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ, బీసీలకు 42%రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. మున్సిపాల్టీలలో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్ చట్టసవరణ చేశారు. గత మున్సిపల్‌ చట్టంలో ఉన్న 50శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ని ఎత్తివేస్తూ ప్రభుత్వం మున్సిపల్ చట్టసవరణ బిల్లును తీసుకు వచ్చింది.

మధ్యాహ్నం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సభలో ప్రవేశ పెట్టి.. చర్చించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అయితే ఇవాళ్టి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది. మొదట బీసీ బిల్లు పై చర్చ జరగగా.. అనతంరం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ ను ప్రవేశపెట్టనుంది.

Published on: Aug 31, 2025 09:06 AM