కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు

Updated on: Dec 23, 2025 | 1:47 PM

ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ కూలిపోవడంపై ఆందోళనలున్నాయి. సాంకేతిక లోపం కారణంగా స్పేస్‌ఎక్స్ నియంత్రణ కోల్పోయిన ఉపగ్రహం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. అయితే, అది భూమికి లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాంటి ముప్పు కాదని స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసింది. వాతావరణ ఘర్షణతో కాలిపోతుందని అంచనా. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడమే స్టార్‌లింక్ లక్ష్యం.

ఎలాన్‌ మస్క్‌ ప్రారంభించి స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ కుప్పకూలిపోతుందా? దీని ప్రభావంతో భూమికి ముప్పు వాటిల్లబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని శాటిలైట్స్‌లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపుతప్పి భూమివైపు వస్తోంది. డిసెంబరు 17వ తేదీన శాటిలైట్‌ 35956 భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది హఠాత్తుగా అక్కడి నుంచి కూలిపోవడం ప్రారంభమైంది. స్పేస్‌ ఎక్స్‌ దానిపై నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో స్పేస్‌ ఎక్స్‌ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్‌ ట్యాంక్‌లో గ్యాస్‌ అత్యంత శక్తిమంతంగా బయటకు వెలువడిందని, దీంతో ఒక్కసారిగా అది నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయని, వారం రోజుల్లోగా భూవాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు అని ఎక్స్‌లో పోస్టు చేసింది. డిసెంబరు 20 శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా.. వెంటోర్‌టెక్‌ సంస్థకు చెందిన వరల్డ్‌వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హైరిజల్యూషన్‌ చిత్రాలను తీసింది. ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎటువంటి ముప్పు లేదని స్పేస్‌ఎక్స్‌ చెబుతోంది. ప్రస్తుతం అది ఐఎస్‌ఎస్‌ కంటే కిందే ఉందని వెల్లడించింది. అది లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉండటంతో.. భూగురుత్వాకర్షణ శక్తి దానిని సులువుగా లాగేస్తుందని వెల్లడించింది. ఇవి వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్‌లింక్‌ ప్రాజెక్టు కింద 9,000 ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్‌ అంతరిక్షంలోకి పంపింది. దీంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను సరఫరా చేయగలుగుతోంది. అమెరికాలోని నాసా, యూఎస్‌ స్పేస్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..

వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే

టీ20 వరల్డ్‌కప్‌ 2026.. గిల్‌కు షాక్‌.. అక్షర్‌కు ప్రమోషన్‌!

బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం

ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్‌