అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

Updated on: Apr 23, 2025 | 7:29 PM

పెరుగుతున్న టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు తమదైనశైలిలో ఉపయోగించుకుంటున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడతో ప్రజలను మోసం చేసి అడ్డంగా దోచుకోవడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకూ అన్‌నోన్‌ కాల్స్‌.. వాట్సప్‌ మెసేజెస్‌.. వివిధ రకాల ఎట్రాక్టివ్‌ లింక్స్‌తో మోసం చేసిన సైబర్‌ కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్తరకం స్కాంకు తెరలేపారు.

ఈ నయా స్కాంను గుర్తించిన కేరళ పోలీసులు ప్రజలకు అలర్ట్‌ జారీ చేశారు. వాట్సప్‌లో వచ్చిన ఫోటోలను తెరవడం వల్ల మీ ఫోన్లు హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉందని, తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫోటోలు, లేదా వీడియోలను డౌన్‌లోడ్‌ చేయడంకానీ, వాటిని ఓపెన్‌ చేసే ప్రయత్నం కానీ చేయొద్దని హెచ్చరించారు. అంతేకాదు.. మీకు తెలియకుండా అలాంటి వీడియోలు, ఫోటోలు డౌన్‌లోడ్‌ కాకుండా మీ ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే మంచిదని సూచించారు. ఈ మేరకు కేరళ పోలీసులు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. పోలీసుల పోస్ట్‌ ప్రకారం.. ఈ స్కామ్ వెనుక ఉన్న టెక్నాలజీ పేరు స్టెగానోగ్రఫీ. దీని సహాయంతో హానికరమైన కోడ్‌ను చిత్రాలలో దాచి ఉంచుతారు. ముఖ్యంగా “LSB స్టెగానోగ్రఫీ” అనే విధానంలో, డేటా.. చిత్రంలోని తక్కువ ముఖ్యమైన పిక్సెల్స్‌లో కప్పివేస్తారు. మీరు చూసే ఫోటో సాధారణంగా కనిపించినా, తెరవగానే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్‌లోని పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, OTPలు అన్నీ నేరస్థుల చేతుల్లోకి వెటంనే వెళ్లిపోతాయి. ఇప్పటివరకూ మనకు తెలిసిన సైబర్‌ మోసాలు లింక్ క్లిక్ చేయడం ద్వారా జరిగినవే తెలుసు. ఇది అంతకు మించిన మోసం. ఇక్కడ లింక్ అవసరం లేదు, లాగిన్ అవసరం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు

అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్‌ చూసి

చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!