గగన్‌యాన్ సహా ఏడు ప్రయోగాలు
ఇస్రో 2026 మార్చి నాటికి ఏడు కీలక అంతరిక్ష ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. ఇందులో మానవరహిత గగన్‌యాన్ (వ్యోమమిత్ర రోబో), బ్లూబర్డ్-6 శాటిలైట్, దేశీయ ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలున్నాయి. ఇది 2027 మానవసహిత యాత్రకు సన్నాహకం. అంతరిక్ష రంగంలో భారత్ తన సత్తా చాటుతూ అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ విసురుతోంది.
అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటుతోంది. వరుస ప్రయోగాల సక్సెస్‌లతో అభివృద్ధి చెంది దేశాలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో మానవ రహిత గగన్‌యాన్ సహా ఏడు రాకెట్ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వరుసగా చేపట్టబోతున్నది. మార్చి 2026లోగా ఈ ఏడు ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఇందులో మొదటిది, ‘బ్లూబర్డ్-6’ శాటిలైట్‌ను వచ్చే వారం ప్రయోగిస్తున్నారు. ‘గగన్‌యాన్’ మిషన్‌లో మానవ రహిత ప్రయోగం ద్వారా ‘వ్యోమిత్రా’ రోబోను రోదసిలోకి పంపి, తిరిగి భూమి మీదకు తీసుకురాన్నారు. 2027లో భారత్ చేపట్టే మానవ సహిత రోదసి యాత్రకు ఇది సన్నాహక ప్రయోగం లాంటిదిగా ఇస్రో భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్చి నాటికి ఏడు అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఉపగ్రహాల కోసం స్వదేశీ విద్యుత్ చోదక వ్యవస్థ, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ పరిజ్ఞానాల పరీక్ష వంటివి కూడా ఉన్నాయి. వచ్చేవారం ఎల్‌వీఎం3 ద్వారా అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థకు చెందిన బ్లూబర్డ్-6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతారు. మానవసహిత ప్రయోగాలకు అనువైన ఎల్‌వీఎం3 ద్వారా వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వ్యోమమిత్ర అనే రోబోను ప్రయోగిస్తారు. తొలిసారిగా దేశ ప్రైవేటు కంపెనీలు నిర్మించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌నూ వచ్చే ఏడాది నింగిలోకి పంపుతారు. ఇది ఓషన్‌శాట్, భారత్-మారిషస్ ఉమ్మడి ఉపగ్రహం, ధ్రువా స్పేస్‌కు చెందిన లీప్-2 శాటిలైట్‌ను కక్ష్యలోకి చేరుస్తుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా
సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు
నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..