Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ

Phani CH
|

Updated on: Jun 27, 2025 | 5:56 PM

Share

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు బాగా వినియోగంలోకి వస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా.. రాబోయే రోజులలో చిన్న చిన్న విమానాశ్రయాలను నుంచి వేలాది ఎలక్ట్రిక్ విమానాలు రయ్యిన టేకాఫ్ కాబోతున్నాయి. బీటా టెక్నాలజీస్ అనే అమెరికన్ సంస్థ ఈ దిశగా గొప్ప ప్రయోగమే చేసింది. ఈ సంస్థ "అలియా సీఎక్స్300" అనే ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది.

ఇటీవల దీనిని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్.కెనడీ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. కాగా, ఈ 130 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ.. తమ విమానానికి అయిన ఖర్చు.. కేవలం రూ.694 లు మాత్రమేనని సదరు సంస్థ ప్రకటించింది. 100 శాతం విద్యుత్‌తో నడిచే తమ విమానం బాటలోనే రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ విమానాలు వస్తాయని, అప్పుడు కారుచౌకగా సామాన్యులు సైతం విమానం ఎక్కొచ్చని ఆ సంస్థ చెబుతోంది. కేవలం 35 నిమిషాల్లోనే.. తమ విమానం 130 కి.మీ ప్రయాణించిందని, తొలి ట్రిప్‌లో నలుగురు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిందని బీటా టెక్నాలజీస్ సీఈఓ క్లార్క్ చెప్పారు. కేవలం రూ. 694 రూపాయలతో తమ ప్రయాణం ముగిసిందని, అదే హెలికాఫ్టర్‌లో వెళ్లాలంటే.. కేవలం ఇంధనం కోసమే తాము దాదాపు 160 డాలర్లు( రూ. 13,800) ఖర్చు పెట్టాల్సి వస్తోందని వివరించారు. పైలట్ల జీతాలు, ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ.. సాధారణ విమాన ప్రయాణాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం చాలా చౌక అని క్లార్క్ చెప్పుకొచ్చారు. 2017లో తాము ఈ సంస్థను పెట్టి, గత ఆరేళ్లుగా సీఎక్స్ 300 మోడల్ విమానాల మీద ప్రయోగాలు చేస్తున్నామని, ఎట్టకేలకు తాము సక్సెస్ అయ్యామని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. త్వరలోనే సివిల్ ఏవియేషన్ వారి అనుమతలు సాధించి ప్రయాణికుల కోసం విమానాలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపారు. తమ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 463 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దీనివల్ల చిన్న చిన్న టౌన్ల మధ్య సామాన్యులు సైతం తమ విమానంలో ప్రయాణించే అవకాశం ఎంతో దూరంలో లేదని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ప్రయోగం.. భవిష్యత్తులో విమానయాన రంగంలో గొప్ప విప్లవం సృష్టించనుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

అలాంటి వారిని వదిలిపెట్టను.. హెచ్చరించిన మంచు విష్ణు