Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారంటూ జూన్ 24 ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అలాగే ఈ విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ పనులను మధ్యలోనే వదిలిపెట్టి హైదరాబాద్ కు పయనమయ్యారని రూమర్లు వినిపించాయి.
ఈ వార్తలను చూసి మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు. అంజనమ్మ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. అయితే నాగబాబు స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. అవన్నీ తప్పుడు వార్తలంటూ చెప్పారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ తన ఎక్స్ హ్యాండిల్లో రాసుకొచ్చారు నాగబాబు . ఇక ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్… ఊపిరి పీల్చుకున్నారు. ఇక అంతకు ముందే… మొగిలి రేకులు ఫేం ఆర్కే నాయుడు అంజనమ్మను కలిశారు. తన ‘ది 100’ సినిమా ప్రమోషన్లో భాగంగా… అంజనమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చిరు తల్లి సంపూర్ణ ఆరోగ్యంగా ఆ వీడియోలో కనిపిస్తుంటే ఈ తప్పుడు న్యూస్‌లు క్రియేట్ అవ్వడం.. అవి వైరల్ అవడం చాలా దారుణం అనే కామెంట్ నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్ పంచ్
యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

