AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google vs Chat GPT: మొబైల్ లో ఏఐ వాడుతున్నారా.. గూగుల్ వార్నింగ్.!

Google vs Chat GPT: మొబైల్ లో ఏఐ వాడుతున్నారా.. గూగుల్ వార్నింగ్.!

Anil kumar poka
|

Updated on: Feb 14, 2024 | 9:43 AM

Share

మొబైల్ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారా.. అయితే మీ గుట్టు మొత్తం రట్టయినట్టే అంటోంది గూగుల్‌. అవును ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన AI జెమినీ యాప్‌లో మీ వ్యక్తిగత వివిరాలు ఎంటర్‌ చేయొద్దని సూచించింది. అలా చేస్తే మీ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది. మొబైల్ లో ఛాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు..

మొబైల్ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారా.. అయితే మీ గుట్టు మొత్తం రట్టయినట్టే అంటోంది గూగుల్‌. అవును ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన AI జెమినీ యాప్‌లో మీ వ్యక్తిగత వివిరాలు ఎంటర్‌ చేయొద్దని సూచించింది. అలా చేస్తే మీ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది. మొబైల్ లో ఛాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు ఏఐ యాప్ లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం తమ ఏఐ యాప్ జెమినీ పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన దశలో ఉందని తెలిపింది. ఈ యాప్ పరిశీలనలో బయటపడిన వివరాలను పరిశీలించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఓ వార్నింగ్ ఇష్యూ చేసింది. మొబైల్ వినియోగదారుల కోసం తయారుచేసిన AI యాప్ లలో డాటా చాలా రోజుల పాటు ఉండిపోతుందని గూగుల్ పేర్కొంది. జెమినీ యాప్ లో అయితే మూడేళ్ల పాటు ఆ డాటా డిలీట్ కాదని తెలిపింది. యాప్ మొత్తాన్నీ డిలీట్ చేసినా సరే గతంలో మీరు నమోదు చేసిన వివరాలు తొలగిపోవని వివరించింది. దీనికి కారణం.. ఏఐని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఏర్పాట్లేనని వెల్లడించింది. జెమినీ యాప్ లో ఎంటర్ చేసే వివరాలను యాప్ మరోచోట స్టోర్ చేస్తుందని, దాంతో యాప్ కు కానీ అప్పటి వరకు మీరు చేసిన చాటింగ్ కు కానీ లింక్ ఉండదని గూగుల్ తెలిపింది. యాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని మూడేళ్ల పాటు నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. అంతేకాదు, జెమినీ యాప్ లో కూడా దాదాపు 72 గంటల పాటు డాటా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పింది. అంటే.. మీ చాటింగ్ పూర్తయిన తర్వాత మెసేజ్ లను డిలీట్ చేసినా సరే 72 గంటల వరకు ఆ డాటా మొత్తం స్టోరేజ్ లో ఉంటుందని గూగుల్ తెలిపింది. ఈ క్రమంలోనే తన వినియోగదారులకు డాటా వాడకంపై గూగుల్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 14, 2024 09:14 AM