Tamil Nadu: వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. ఈ వాయుగుండం డిసెంబరు 3 నాటికి తుఫాన్‌గా మారి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుందని హెచ్చరించింది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు అనేక జిల్లాల్లో రెండు రోజులగా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. చెన్నైలో కొన్నిచోట్ల సబ్‌వేలు మూసివేశారు. రైల్వే ట్రాక్‌పై నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లను నిలిపివేశారు. కాగా ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు , నాగపట్నం , రామనాథపురం , చెన్నై ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.