AP News: కుప్పకూలిన అపార్ట్మెంట్ గోడ.. భయాందోళనలో స్థానికులు..

Edited By:

Updated on: Dec 06, 2023 | 9:15 PM

రాజమండ్రి సుభాష్ నగర్ సాయి హైరైస్ అపార్ట్మెంట్ లో భారీ వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది. వర్షంతో పాటు ఐదంతస్తుల అపార్ట్మెంట్ పక్కనే మరో భవన నిర్మాణానికి పునాది వేయడం కోసం ఎక్కువ లోతులో గుంతలు తవ్వారు కార్మికులు. దీంతో తమ అపార్ట్మెంట్ గోడ కృంగి పోయిందంటున్నారు ఇందులో నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులు.

రాజమండ్రి సుభాష్ నగర్ సాయి హైరైస్ అపార్ట్మెంట్ లో భారీ వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది. వర్షంతో పాటు ఐదంతస్తుల అపార్ట్మెంట్ పక్కనే మరో భవన నిర్మాణానికి పునాది వేయడం కోసం ఎక్కువ లోతులో గుంతలు తవ్వారు కార్మికులు. దీంతో తమ అపార్ట్మెంట్ గోడ కృంగి పోయిందంటున్నారు ఇందులో నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులు. తెల్లవారుజామున పెద్ద శబ్దం వచ్చి ప్రహరీ గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కన అపార్ట్మెంట్ నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న అపార్ట్మెంట్ కి ఆనుకుని బీమ్స్ కనిపించేలా తవ్వేయడంతో ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

నగరపాలక సంస్థ కమిషనర్ ను సంప్రదించి అపార్ట్మెంట్లో ఉన్న 10 కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. మోతాదుకు మించి తవ్వేయడంతో మట్టి కృంగిపోయి అపార్ట్మెంట్ సెల్లార్ లోపల బీటలు వాలి ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటు అవేదన వ్యక్తం చేస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరింత ప్రాణ, ఆస్తి నష్టం జరుగకముందే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..