తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

Phani CH

|

Updated on: Nov 29, 2023 | 1:22 PM

శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 23 ఏళ్ల మౌనిక అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురయింది. మౌనిక జిల్లాలోని నానుబాలు వీధిలోని సచివాలయంలో పనిచేస్తోంది. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో బయటకు వచ్చిన మౌనిక స్కూటీపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో బైక్‌ మౌనిక స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఎగిరి అవతల పడిన మౌనిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 23 ఏళ్ల మౌనిక అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురయింది. మౌనిక జిల్లాలోని నానుబాలు వీధిలోని సచివాలయంలో పనిచేస్తోంది. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో బయటకు వచ్చిన మౌనిక స్కూటీపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో బైక్‌ మౌనిక స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఎగిరి అవతల పడిన మౌనిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం స్థానికంగా పలు అస్పత్రులకు తిప్పారు. చివరికి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు, కానీ ఫలితం దక్కలేదు. మౌనిక బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మౌనిక తల్లిదండ్రులకు వైద్యులు అవయవదానంపై అవగాహన కల్పించగా వారు అందుకు సమ్మతించారు. వెంటనే ప్రభుత్వం నుంచి జీవన్‌ ధాన్‌ని అనుమతి పొంది, మౌనిక నుంచి గుండె, మూత్రపిండాలు, కళ్లు సేకరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌

గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు

తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. మల్లారెడ్డి మాటలకు బిత్తరపోయిన రణ్‌బీర్

హీరోయిన్‌ను టచ్‌ చేసి ఫోటోకు ఫోజిస్తే.. 30 లక్షలా