Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??
టీం ఇండియా తరపున విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మోత మోగించిన ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కథ ఇది. ఆయన చిన్న తనం గురించి తెలిస్తే.. ఎవరికైనా ఇదో ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించక మానదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి పదేళ్ల వయస్సులోనే క్రికెటర్ కావాలనే ఆశయంతో ఇల్లు వదిలి ముంబయికి వచ్చేశాడు. అయితే ముంబయిలో బతకడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఒక షాపులో పనిచేశాడు.
టీం ఇండియా తరపున విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మోత మోగించిన ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కథ ఇది. ఆయన చిన్న తనం గురించి తెలిస్తే.. ఎవరికైనా ఇదో ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించక మానదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి పదేళ్ల వయస్సులోనే క్రికెటర్ కావాలనే ఆశయంతో ఇల్లు వదిలి ముంబయికి వచ్చేశాడు. అయితే ముంబయిలో బతకడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఒక షాపులో పనిచేశాడు. కానీ, రోజంతా క్రికెట్ ఆడి అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో యజమాని అతడిని పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత గ్రౌండ్‌లో టెంట్లో ఉంటూ స్కోర్ బోర్డ్‌పై స్కోర్ వేసేవాడు. ఆ పై తన సంపాదన పెంచుకోవడం కోసం యశస్వి పండగల సమయంలో వీధుల్లో తినుబండారాలు విక్రయించేవాడు. కానీ, క్రికెటర్‌కి కావాల్సిన మంచి ఆహారం తీసుకోవడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. అన్నం, పిండి, బంగాళదుంపలు తినేవాడు.. వారానికొక్క రోజు ఆదివారం చికెన్ తినేవాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్
ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??