Watch Video: ఇలా కూడా గోల్ చేస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!

|

Jan 04, 2022 | 9:54 AM

సోషల్ మీడియాలో అలాంటి పెనాల్టీ ఒకటి చర్చనీయాంశమైంది. ఇది చూసి మీరు కూడా పగలబడి నవ్వుతారు. ఇది ఆల్ జపాన్ హైస్కూల్ టోర్నమెంట్‌లో జరిగిన సంఘటన.

Watch Video: ఇలా కూడా గోల్ చేస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!
Viral Foot Ball
Follow us on

Viral Video: క్రిస్టియానో ​​రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్‌ల పెనాల్టీ షూటౌట్‌లు ఫేమస్. అభిమానుల నాలుకపై ఎప్పుడూ ఇవి నానుతూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పెనాల్టీ ఒకటి చర్చనీయాంశమైంది. ఇది చూసి మీరు కూడా పగలబడి నవ్వుతారు. ఇది ఆల్ జపాన్ హైస్కూల్ టోర్నమెంట్‌లో జరిగిన సంఘటన. పెనాల్టీ సమయంలో షూటర్ ఫుట్‌బాల్‌ను చేరుకోవడానికి 40 సెకన్లు తీసుకున్నాడు.

పెనాల్టీ షూటర్‌ ప్రత్యేక శైలి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీని వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో, షూటర్ ఫుట్‌బాల్ వైపు చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. బాల్ నుంచి కొద్ది దూరం వెళ్లి, మరలా వెనక్కి వస్తూ చాలా నెమ్మదిగా కదిలాడు. ఈ దూరం చేరడానికి దాదాపు 40 సెకన్లు తీసుకున్నాడు. ఈ చర్యతో గోల్ కీపర్ దాదాపు విసుగు చెందాడు. అలాంటి సమయంలో షూటర్ పైకి దూకి ఫుట్‌బాల్‌ను గట్టిగా తన్ని గోల్ చేశాడు.

గోల్‌కీపర్ అంచనా తప్పింది..
ఈ మ్యాచ్ Ryutsu Kezai Ogashi వర్సెస్ Kindai Wakayama మధ్య జరిగింది. అయితే ఇది డ్రాగా ముగిసింది. పెనాల్టీ షూటౌట్‌కు చేరుకున్న మ్యాచ్ ఆ తర్వాత ఈ ఆసక్తికరమైన కిక్ కనిపించింది. Ryutsu నుంచి షూటౌట్ తీసుకున్న ఆటగాడు ఈ ప్రత్యేకమైన పెనాల్టీ కిక్ అందించాడు. షూటౌట్ సమయంలో గోల్ కీపర్ తప్పుగా అంచనా వేయడంతో గోల్ వచ్చింది.

ఇటాలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు, చెల్సియా క్లబ్ స్టార్ ప్లేయర్ జోర్గిన్హో పెనాల్టీ షూటౌట్ శైలి ఫుట్‌బాల్ అభిమానులలో చాలా ప్రసిద్ధి చెందింది. పెనాల్టీ షూటౌట్‌లు తీసుకుంటున్నప్పుడు వారు ఫుట్‌బాల్‌కు చాలా దగ్గరగా బౌన్స్ చేస్తారు. మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ఆటగాడు పాల్ పోగ్బా పెనాల్టీ శైలి కూడా ప్రత్యేకమైనది. వారు కూడా చాలా చిన్న అడుగులతో, చాలా ఆలస్యంగా ఫుట్‌బాల్‌ను చేరుకుని గోల్ చేస్తుంటారు. జపనీస్ స్కూల్ ఫుట్‌బాల్ ఆటగాడు జోర్గిన్హో, పోగ్బాల శైలిని చాలా తక్కవ వేగంతో కాపీ చేశాడు.

Also Read: కుక్క పిల్లను దత్తత తీసుకున్న కోతి !! వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు

వింతలకు నిలయంగా మారిన గ్రామం !! వారంతా 3 అడుగులకు మించి పెరగరు !! వీడియో