Watch Video: చివరి ఓవర్లో హైడ్రామా.. హ్యాట్రిక్‌తో బౌలర్ దూకుడు.. 6 పరుగుల కోసం బ్యాటర్ల పోరు..!

|

Jan 25, 2022 | 10:20 AM

Viral Video: ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదు. అలాగే ఈ మ్యాచ్ ఏ ప్రధాన లీగ్‌లో భాగం కానేకాదు. కానీ, ఉత్కంఠతలో మాత్రం ఈ మ్యాచులకు ఏమాత్రం తీసిపోదు.

Watch Video: చివరి ఓవర్లో హైడ్రామా.. హ్యాట్రిక్‌తో బౌలర్ దూకుడు.. 6 పరుగుల కోసం బ్యాటర్ల పోరు..!
Viral Video
Follow us on

Viral Video: క్రికెట్(Cricket) అంటే సాహసంతోపాటు ఉత్సాహం ఇచ్చే ఆట. ఎన్నో మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మరెన్నో మ్యాచులు చివరి బాల్‌ వరకు ఉత్కంఠగా సాగాయి. ప్రతి క్రికెట్ అభిమాని తప్పకుండా ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుతం జరిగింది. బ్యాట్స్‌మెన్స్‌ వచ్చి వెళ్తున్నారు. బౌలర్ మాత్రం‌ హ్యాట్రిక్‌(Hat Trick) తీసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే, కొత్త బ్యాట్స్‌మెన్‌ స్ట్రైక్‌లోకి వచ్చాడు. చివరి బంతికి సిక్స్‌ కావాలి. ఆ బాల్ సిక్స్‌గానే అనిపించింది. చివర్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదు. అలాగే ఈ మ్యాచ్ ఏ ప్రధాన లీగ్‌లోనూ భాగం కాదు. అయినా ఈ టీ20 మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఇది సాధారణ టోర్నమెంట్‌లో ఆడిన మ్యాచ్. చివరి ఓవర్‌‌కు చేరిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతకు గురి చేసింది. ఎందుకంటే, పరుగుల వేట సాగిస్తున్న జట్టులో మిడిలార్డర్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరుతూ కష్టాల్లో చిక్కుకపోయారు.

చివరి ఓవర్లో ట్విస్ట్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన MOS జట్టు 154 పరుగులు చేసి UNSW ముందు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు 19వ ఓవర్‌కు 148 పరుగులు చేసింది. దాదాపు విజయం ఖాయమైంది. కానీ, ఈ మ్యాచ్‌లో ఓ ట్విస్ట్‌తో ఉత్కంఠ విజంయ సాధించారు.

ఈ చివరి ఓవర్‌లో ఏం జరగిందంటే.. తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికే బౌలర్ టర్నర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో బంతికి కూడా వికెట్‌ తీశాడు. నాలుగో బంతికి కూడా వికెట్ పడగొట్టాడు. ఇక విజయానికి చివరి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు. 5వ బంతికి సింగిల్‌ వచ్చింది. అంటే ఓవర్ చివరి బంతికి సిక్స్ కావాలి.

చివరి బంతికి సిక్స్..
చివరి బంతికి విజయం సాధించాలంటే 6 పరుగులు రావాలి. బ్యాట్స్‌మెన్ చూడకుండానే బంతిని బాదేశాడు. బంతి బౌండరీ లైన్ దాటి వెళ్లింది. చివరి ఓవర్లో ఉత్కంఠతతో UNSW జట్టు విజయం సాధించింది. దీంతో బ్యాట్స్‌మెన్‌లో ఉత్సాహంగా మైదానంలోనే గుమిగూడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read: T20 Records: 5000 పరుగులు, 400 వికెట్లు.. టీ20 రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న ఆల్‌రౌండర్..!

IND vs SA: ‘జై శ్రీరామ్’ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?