Dhoni Viral Video: కుర్రాడికి లిఫ్ట్ ఇచ్చి బుక్కయిన ధోనీ.. మహీపై నెటిజన్ల ఫైర్..! వీడియో వైరల్..
దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే మహీ.. రాంచీలో ఓ యువ క్రికెటర్‌కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ధోనీ బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న ఆ కుర్రాడు.. వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ సూపర్ అంటూ.. అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినప్పటి నుంచి రియల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే మహీ.. రాంచీలో ఓ యువ క్రికెటర్‌కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ధోనీ బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న ఆ కుర్రాడు.. వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ సూపర్ అంటూ.. అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినప్పటి నుంచి రియల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో అప్పుడప్పుడు మైదానానికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సొంతూరైన రాంచీలో ధోనీ.. మైదానానికి వెళ్లి సరదాగా గడిపిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో.. ఓ యువ క్రికెటర్‌కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. గ్రౌండ్లో ఉన్న ధోనీ కనిపించేలా.. ఆ యంగ్ ప్లేయర్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ధోనీతో కలిసి బైక్ మీద వెళ్తూ.. వీడియో తీశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. ఈ యువ క్రికెటర్ లక్కీ ఫెలో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. మరోవైపు బైక్ నుంచి పొగ ఎక్కువగా వస్తుండటంతో మరికొందరు ఫైర్ అవుతున్నారు.. బండి సర్వీసింగ్ చేయించండి.. ఇంజిన్ ఆయిల్ మార్పించండి.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..