మన అనంతపురం అమ్మాయి అదుర్స్‌.. తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న దీపిక

Updated on: Nov 26, 2025 | 7:14 PM

టీసీ దీపిక సారథ్యంలో భారత అంధ మహిళల జట్టు తొలి టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అద్భుత ప్రతిభ కనబరిచింది. ఐదు నెలల ప్రాయంలో ఒక కంటి చూపు కోల్పోయిన దీపిక, క్రికెట్‌లో రాణించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె కలెక్టర్ కావాలనే ఆశయం కూడా ఉంది.

క్రికెట్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచి నెల తిరగకముందే అంధ మహిళలు అదరహో అనిపించారు. తెలుగు అమ్మాయి దీపిక నేతృత్వంలో మరో ప్రపంచకప్ భారత్‌ సొంతమైంది. అది కూడా అంధ మహిళల టీ20 విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్‌ కావడం గమనార్హం. దీంతో దేశంలోని అందరి దృష్టి టీసీ దీపికపై పడింది. ఎవరీ దీపిక? ఏ ప్రాంతానికి చెందిన వారనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపికది నిరుపేద కుటుంబం. దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప వ్యవసాయ కూలీలు. దీపిక ఐదు నెలల ప్రాయంలో ఉన్న సమయంలో చేతి వేలు గోరు తగిలి ఒక కంటి చూపు పోయింది. కర్ణాటకలోనే ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించిన దీపిక చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే మక్కువ. ఎంతో ఇష్టంతో క్రికెట్‌లో రాణించి జాతీయస్థాయి వరకు వెళ్లింది. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అంధ మహిళల క్రికెట్‌ టీ–20 ప్రపంచ కప్‌ టోర్నీలో దీపిక సత్తా చాటింది. భారత జట్టుకు దీపికనే కెప్టెన్‌గా వ్యవహరించి, అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ నెల 23న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడిన నేపాల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 12.1 ఓవర్లలోనే 117 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. తన ప్రతి విజయం వెనుక అమ్మ, నాన్న ప్రోత్సాహం మరువలేనిదని చెప్పింది దీపిక. చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలని నా ఆశ. అయితే పేదరికం కారణంగా యూపీఎస్సీకి సిద్ధం కాలేకపోతున్నానని చెప్పింది. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ సహకరిస్తే ఈ కలను సాకారం చేసుకుని ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తానంటోంది దీపిక

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!