Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో పక్కటెముకల గాయంతోపాటు అంతర్గత రక్తస్రావం కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని డాక్టర్లు వెల్లడించినా, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మరికొన్ని రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్ అవసరమని సూచించారు. శ్రేయస్ మరో వారం రోజులు ఆసుపత్రిలో ఉండనున్నారు.
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు పక్కటెముకల గాయం అయింది. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు గుర్తించారు. ఈ గాయం కారణంగా గత రెండు రోజులుగా ఆయన ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రేయస్ అయ్యర్‌కు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు. అయితే, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు, ఆయనను మరికొన్ని రోజులు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియో
Kakinada: సైక్లోన్ ప్రభావంతో కిక్కిరిసిన మార్కెట్లు, రైతు బజార్లు