MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌ ఎప్పుడంటే.? కారణం అదేనా..

|

May 23, 2024 | 10:28 PM

ఐపీఎల్ 2024 17వ సీజన్‌లో ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఫలితంగా సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే ధోనీకి చివరిదని, మహీని మళ్లీ మైదానంలో చూడలేమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటికొచ్చింది.

ఐపీఎల్ 2024 17వ సీజన్‌లో ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఫలితంగా సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే ధోనీకి చివరిదని, మహీని మళ్లీ మైదానంలో చూడలేమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటికొచ్చింది. తొడ కండరం గాయంతో బాధపడుతున్న ధోనీ దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్‌ వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ధోనీ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాడని పేర్కొన్నాయి. ఐపీఎల్ సమయంలో ధోనీ తొడ కండరం గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం అతడు లండన్ వెళ్లొచ్చు. ధోనీ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. కానీ, క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు. శస్త్రచికిత్స తర్వాతే అతడు తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు. చికిత్స తీసుకుని కోలుకోవడానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది అని సీఎస్కే వర్గాలు తెలిపాయి.

నిజానికి ఈ ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు నుంచే ధోనీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. జట్టు రెండో వికెట్‌ కీపర్‌ అయిన డేవిడ్‌ కాన్వే కూడా గాయం బారిన పడటంతో.. తప్పనిసరి స్థితిలో మహీనే బాధను ఓర్చుకొని మైదానంలోకి దిగాడు. ఓ పక్క గాయానికి మందులు వాడుతూనే.. వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకొంటూ ఆడాడు. వాస్తవానికి డాక్టర్లు అతడిని విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ, జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ధోనీనే నిలబడాల్సి వచ్చింది. గత ఐపీఎల్‌లో కెప్టెన్‌ కూల్‌ మోకాలి గాయంతోనే ఆడి.. జట్టుకు కప్పు అందించాడు. ప్రస్తుతం అది పూర్తిగా నయమైంది. కానీ, కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on