ఐపీఎల్ వేలంపై రవిచంద్రన్ అశ్విన్ జోస్యం

Updated on: Dec 16, 2025 | 6:55 PM

ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలంలో అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్లు, స్టార్ ఆల్-రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు భారీ డిమాండ్ ఉంటుందని రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశారు. జట్లు కేవలం ఆటగాళ్లను కాకుండా తమ సమస్యలకు పరిష్కారాలను కొనుగోలు చేస్తాయని ఆయన వివరించారు. భారత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా మంచి ధర పలకనుంది.

2026 ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరో కొన్ని గంటల్లో ఆక్షన్‌కు తెరలేవనుంది. 16వ తేదీన అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించి వేలానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయా జట్లకు మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు భారత్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆటగాళ్లతో పాటు, అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్లకు భారీ డిమాండ్ ఉంటుందని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామోరూన్ గ్రీన్ జాక్ పాట్ కొట్టడం ఖాయమని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడిపై కాసుల వర్షం కురవడం ఖాయమని పేర్కొన్నాడు. అయితే, ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లను పక్కనబెడితే అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ల కోట్ల రూపాయలు పలుకుతారని రవిచంద్రన్ అశ్విన్ జోస్యం చెప్పాడు. అన్‌క్యాప్డ్ భారత ప్లేయర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పాడు. వేలంలో టీమ్‌లు ప్లేయర్‌ను కాదు, సమస్యకు పరిష్కారాన్ని కొనుగోలు చేస్తాయని అశ్విన్ వివరించాడు. ఒక ఫ్రాంచైజీకి మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల భారత వికెట్‌కీపర్ అవసరం ఉంటే, మొదటి ఆప్షన్ మిస్ అయితే వెంటనే రెండో ఆప్షన్ కోసం తీవ్రంగా బిడ్ చేస్తుందని చెప్పాడు. ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‎లో ఆర్సీబీ, ముంబై ఫ్రాంచైజీలు తరుఫున ప్రాతినిథ్యం వహించాడు. క్యాచ్ రిచ్ లీగులో ఇప్పటి వరకు 29 మ్యాచులు ఆడిన గ్రీన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 41.5 సగటుతో 707 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‎తో పాటు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కామోరూన్ గ్రీన్ కు ఉంది.2025 ఐపీఎల్ సీజన్‎కు వెన్నుముక గాయం కారణంగా దూరమయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్‌ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్‌

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌…భారీగా తగ్గిన బంగారం ధరలు

ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్

చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ

దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌… కాశీ తర్వాత ఇక్కడే…