మరో ప్రపంచకప్ భారత్ వశం.. కెప్టెన్ మరెవరో కాదు మన తెలుగమ్మాయే

Edited By:

Updated on: Nov 26, 2025 | 3:41 PM

భారత్ అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కెప్టెన్ దీపిక అద్భుతమైన నాయకత్వంతో ఈ చారిత్రక విజయాన్ని సాధించింది. బాల్యం నుంచే కంటిచూపు కోల్పోయినా, పట్టుదలతో క్రీడాకారిణిగా ఎదిగి, దేశానికి ప్రపంచ కప్ అందించిన దీపిక ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి.

మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత్ కు. మరో ప్రపంచ కప్ కూడా సొంతమైంది. ఈసారి అంధుల మహిళా టీ20 ప్రపంచ కప్ కు భారత్ గెలుచుకుంది. తొలి అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న జుట్టుకు. మన తెలుగు అమ్మాయి నాయకత్వం వహించడం గర్వకారణం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన దీపిక అంధుల మహిళా టీ20 కెప్టెన్గా. భారత్ కు ప్రపంచ కప్ అందించింది. శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామమైన తంబాలహట్టికి చెందిన దీపిక. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పేరులో ఉన్న దీపం. జీవితంలో లేకపోయినా ఎంతో కష్టపడి క్రికెట్ అవ్వాలనుకుంది దీపిక. ఆంధ్రప్రదేశ్ కు విసిరేసినట్టుగా ఉన్న. కర్ణాటక సరిహద్దులను కంబాలహరిలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునే తిమ్మప్ప, చిత్తమ్మ దంపతుల కుమార్తె ఈ దీపిక. ఇటీవల నేపాల్ తో జరిగిన అంధుల మహిళ టి20 ప్రపంచ కప్ లో భారత మహిళల టీం కప్పు గెలుచుకుంది. దీపికకు ఐదు నెలల వయసులో. తల్లి చేతి వేలికి ఉన్న గోరు కంటికి గుచ్చుకోవడంతో శాశ్వతంగా చూపు కోల్పోయింది. దీంతో ఒంటి కన్నుతోనే దీపిక విద్యాభ్యాసం కొనసాగించింది. ఎనిమిదో తరగతి తర్వాత దీపికకు క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. సరిగ్గా అప్పుడే 2013లో జాతీయ అందుల మహిళల క్రికెట్ జట్టు ప్రారంభమైంది. అలా క్రికెట్ పై ఉన్న మక్కువతో. దీపిక కర్ణాటక జట్టు తరఫున క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది… కొద్దిరోజులు క్రితం జరిగిన అంధుల మహిళా టి20 ప్రపంచ కప్ జట్టుకు దీపిక కెప్టెన్గా వ్యవహరించింది. లీక్ దశలో పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై దీపిక మెరుపు ఇన్నింగ్స్ ఆడి. ఫైనల్ కు జట్టును తీసుకెళ్లింది. ఫైనల్లో నేపాల్ ను ఓడించి. అంధుల మహిళల టి20 ప్రపంచ కప్ లో భారత్ గెలుపొందింది. పుట్టుకతో అంగవైకల్యం లేకపోయినా. మధ్యలో వచ్చిన అందత్వాన్ని జయించి పట్టుదలతో దీపిక క్రికెటర్ అయ్యింది. అందుల మహిళ టి20 ప్రపంచ కప్ భారత్ గెలవడంతో. దీపిక స్వగ్రామమైన తంబాలహరిలో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక ముంబైలోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. ప్రస్తుతం దీపిక అందులో మహిళా టి20 ప్రపంచ కప్ గెలుచుకొని. స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నల్లమలలో జంగిల్‌ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం

మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..

వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్

కొంపముంచిన హీటర్‌.. డ్రైవర్‌ సజీవదహనం!

Published on: Nov 26, 2025 03:40 PM