FIFA Women’s World Cup: ముద్దు తెచ్చిన ముప్పు..! పదవినే పోగొట్టుకున్నాడు.. వీడియో.
గత నెలలో సిడ్నీలో ఫిఫా మహిళల ప్రపంచకప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో స్పెయిన్ 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అదే స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ కొంపముంచింది. తన దేశం ప్రపంకప్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సదరు క్రీడాకారిణిని ముద్దుపెట్టుకున్నారు. జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. క్రీడాకారిణులతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు.
గత నెలలో సిడ్నీలో ఫిఫా మహిళల ప్రపంచకప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో స్పెయిన్ 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అదే స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ కొంపముంచింది. తన దేశం ప్రపంకప్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సదరు క్రీడాకారిణిని ముద్దుపెట్టుకున్నారు. జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. క్రీడాకారిణులతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో ను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పెయిన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పటికే పదవినుంచి సస్పెండైన ఆయన చివరికి పదవికి రాజీనామా చేశారు. ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది. క్రీడాకారిణి అంగీకారంతోనే చుంబించినట్లు లూయిస్ తెలపగా.. అందుకు తాను అంగీకరించలేదంటూ హెర్మోసో స్పందించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఇక సెప్టెంబర్ 10 అర్ధరాత్రి రూబియాలెస్ తన రాజీనామాను ప్రకటించారు. ఫిఫా విధించిన సస్పెన్షన్ వేటు, తనపై నమోదైన కేసులు కారణంగా..తాను ఈ పదవిలోకి తిరిగిరాలేనని తెలుస్తోందంటూ తన రాజీనామా లేఖలో వెల్లడించారు. ఆయన 2018లో ఫెడరేషన్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవితో పాటు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలనుంచి కూడా వైదొలిగారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..